అసభ్యంగా తనిఖీ చేస్తున్నారు:స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్‌ల ఆందోళన
- March 31, 2018
చెన్నై:స్పైస్‌జెట్‌కు చెందిన భద్రతాధికారులు ఎయిర్‌హోస్టెస్‌లను అసభ్యంగా తనిఖీ చేయడంతో వారు శనివారం ఉదయం ఆందోళనలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా విమానం డీబోర్డింగ్ అయ్యాక తమ వస్తువులను, తమను అధికారులు తనిఖీ చేస్తున్నారని, అదే కాకుండా తమ బ్యాగుల్లో ఉన్న శానిటరీ ప్యాడ్స్‌ను తొలగించాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారపదార్థాలు, ఇతర వస్తువులను ప్రయాణీకులకు ఇవ్వడానికి వారి నుండి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణపై డీబోర్డింగ్ అయ్యాక వాష్‌రూమ్‌కు వెళ్ళకూడదని షరతు కూడా విధించారు. 'తమను గత మూడు రోజులుగా ఘోరంగా తనిఖీ చేస్తున్నారు. మహిళా సిబ్బంది అయినప్పటికీ అసభ్యంగా తాకుతున్నారు. తన కొలిగ్‌ను శానిటరీ ప్యాడ్‌ను తొలగించాలని ఆదేశించారు' అని ఓ ఎయిర్‌హోస్టెస్ తెలిపారు. అయితే... ఈ విషయాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ ఖండించింది. ఏ ప్రయాణీకుడికైనా, భారత్‌లోని ఏ విమానాశ్రయానికి వెళ్లినా, భద్రతా తనిఖీలు ఉంటాయని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







