ఎన్టీఆర్ బయోపిక్‌లో పరేష్ రావల్ పాత్ర ..

- March 31, 2018 , by Maagulf
ఎన్టీఆర్ బయోపిక్‌లో పరేష్ రావల్ పాత్ర ..

బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటీనటుల ఎంపిక జరగవలసి ఉంది. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించేందుకు చాలా మంది నటులను అనుకున్నా సంతృప్తి కరంగా అనిపించలేదని అందుకే బాలీవుడ్ నటుడు పరేష్ రావల‌్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇంతకీ ఆ పాత్ర నాదెండ్ల భాస్కర రావు అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా తిరుగు బాటు చేసిన వ్యక్తి ఆయన. అయితే ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది అన్న విషయాలు మాత్రమే ప్రస్తావిస్తారని సమాచారం. తేజ డైరక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com