దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం అక్రమ రవాణా

- March 31, 2018 , by Maagulf
దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం అక్రమ రవాణా

సాధారణంగా అంతర్జాతీయ విమానాల్లో బంగారం తరలిస్తే  కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కడం ఖాయం. దీంతో స్మగ్లింగ్ ముఠా దేశీయ ప్రయాణీకుల ముసుగులో బంగారం అక్రమ రవాణా సాగిస్తోంది. ఈ మేరకు దుబాయ్ నుండి హైదరాబాద్ కు బంగారం రవాణా చేసేందుకు కనెక్టింగ్ ప్లైట్ లను ఎంచుకుంటున్నారు. దేశీయ ప్రయాణీకులకు కస్టమ్స్ చెకింగ్ ఇబ్బందులు ఉండవు. దీంతో దుబాయ్ నుండి ముంబాయి మీదుగా హైదరాబాద్ కు వచ్చే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణిస్తున్న ఈ ముఠా దర్జాగా బంగారం అక్రమ రవాణా ను కొనసాగిస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫలితంగా ఇటీవల ఓ ప్రయాణీకుడు ఇలా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించి అడ్డం గా దొరికిపోయాడు. ఇది జరిగి కొన్ని రోజులైనా గడవక ముందే తాజాగా మరో ప్రయాణీకుడు జెడ్డా నుండి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లో కిలోకు పైగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. కస్టమ్స్ అధికారులుఈ కేటుగాడికి చెక్ పెట్టి 1.243 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com