'కృష్ణార్జున యుద్ధం' ట్రైలర్ విడుదల
- March 31, 2018
నేచురల్ స్టార్ నాని 21వ చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. ఇందులో కృష్ణుడు, అర్జునుడు కూడా నానియే. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం సమకూర్చారు. నాని, గాంధీ ఇద్దరూ సక్సెస్‌ఫుల్ ఫామ్‌లో ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
2 నిమిషాల 8 సెకన్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్‌లో నాని తెగ హంగామా చేశారు. ఈ ఊళ్లో కృష్ణ అంటే ఎవరు?. అందరి వెంటపడి ప్రపోజ్ చేస్తాడట కదా! అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటూ సాగిపోతోంది. పల్లెటూరి కుర్రోడిగా కృష్ణ రూపంలో కన్పించిన నాని రాక్ స్టార్‌గా అర్జున్ రూపంలో కన్పిస్తున్నాడు. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఏప్రిల్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!