హౌతీ మిసైల్‌ని ధ్వంసం చేసిన సౌదీ
- March 31, 2018
రియాద్: సౌదీ ఎయిర్ డిఫెన్స్, హౌతీ మిలీషియా సంధించిన మిస్సైల్‌ని ధ్వంసం చేసింది. కింగ్డమ్కి చెందిన సదరన్ సిటీ నజ్రాన్ వైపుగా దూసుకొస్తున్న మిస్సైల్‌ని ధ్వంసం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ లక్ష్యంగా ఈ మిస్సైల్‌ని సంధించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. విజయవంతంగా మిస్సైల్‌ని అడ్డగించామనీ, ఈ క్రమంలో మిస్సైల్ తాలకు శకలాలు రెసిడెన్షియల్ ఏరియాలో పడ్డాయనీ, ఓ భారతీయ వలసదారుడికి వీటి కారణంగా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. యెమెన్ నుంచి తరచూ హౌతీ మిలీషియా సౌదీ అరేబియాలోని ముఖ్య నగరాలపైకి మిస్సైల్స్‌తో విరుచుకుపడుతుండడం జరుగుతున్నా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఎప్పటికప్పుడు చాకచక్యంగా ఆ మిస్సైల్స్‌ని గగనతలంలోనే కూల్చివేస్తున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







