గ్రాండ్ పిక్స్‌కి సిద్ధమైన బిఐఏ
- March 31, 2018
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (బిఐఏ) ఆపరేటర్, మేనేజింగ్ బాడీ బహ్రయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ, 2018 ఫార్ములా వన్ (ఎఫ్-1) గ్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్‌కి సంసిద్ధంగా వుంది. అవసరమైన కార్గోకి సంబంధించి అంతా స్మూత్‌గా జరిగేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. వందలాది టన్నుల ఎక్విప్మెంట్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా దిగుమతి కావాల్సి వుంది. వివిధ దేశాల నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌కి విమానాల నుంచి కార్గో దిగుమతి అవుతుంది. ఏప్రిల్ 6 నుంచి 8 వరకు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో ఈ ఈవెంట్ జరుగుతుంది. బిఎసి నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది కార్మోగ కమిటీ, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీ, ఎయిర్ సైడ్ సర్వీసెస్ కమిటీ, టెర్మినల్ ఆపరేషన్ కమిటీల ద్వారా రేస్‌కి సంబంధించిన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్ చీఫ్ మిఖాయిల్ హోహాెన్బర్గర్ మాట్లాడుతూ, ఎఫ్1 ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖమైన ఈవెంట్ అని చెప్పారు. 1000 టన్నులకు పైగా ఎక్విప్మెంట్ (కార్లు, స్పేర్ పార్ట్స్, కంప్యూటర్ ఎక్విప్మెంట్, టూల్స్, ఫ్యూయల్, ఆయిల్) రానున్న రోజుల్లో బిఐసికి చేరుకోనుందని అన్నారు. ఈ నేపథ్యంలో అంతా స్మూత్‌గా జరిగేందుకు తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారాయన. మొత్తం 10 కార్గో విమానాలు బిఐసికి చేరుకోనున్నాయి ఎఫ్-1 నేపథ్యంలో.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







