'భరత్' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కానున్న తారక్, చరణ్.!
- April 01, 2018
ప్రీ రిలీజ్ వేడుకలకు, ఆడియో విడుదల కార్యక్రమాలకు సెలబ్రిటీలు హాజరుకావడం ఇటీవల సర్వసాధారణమైంది. 'ఆనందోబ్రహ్మ' సినిమాకు ప్రభాస్, 'బాలకృష్ణుడు' ఆడియో లాంచ్‌కు సమంత, ఇటీవల 'ఛలో' వేడుకకు చిరంజీవి హాజరై సందడి చేశారు.
ఇప్పుడు 'భరత్' కోసం ఎన్టీఆర్, రామ్‌చరణ్ అతిథులుగా రాబోతున్నారట. మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ వేడుక ఏప్రిల్7న జరగబోతోంది. ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారంతా ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారాలు చేశారట.
ఈ సినిమాలో మహేశ్ ఏపీ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు కాబట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని చిత్రబృందం భావించిందట. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దానయ్య ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తారక్, చరణ్‌తో ఓ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. అందుకే 'భరత్' వేడుకకు వారిని రావాల్సిందిగా కోరారట. ఇందుకు వారూ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







