మరో 24 గంటల్లో భూమిని ఢీ కొట్టనున్న స్పేస్‌ ల్యాబ్ టియాంగ్‌గాంగ్-1

- April 01, 2018 , by Maagulf
మరో 24 గంటల్లో భూమిని ఢీ కొట్టనున్న స్పేస్‌ ల్యాబ్ టియాంగ్‌గాంగ్-1

అంతరిక్షంలో గతి తప్పి భూమి వైపు దూసుకొస్తున్న స్పేస్‌ ల్యాబ్ టియాంగ్‌గాంగ్-1 రానున్న 24 గంటల్లో  భూమిని ఢి కొట్టనున్నట్లు చైనా స్పేస్‌ సెన్సెస్‌ అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది. వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం అది గంటకు 26 వేల కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంని వెల్లడించింది. దాదాపు 8.5 టన్నుల బరువున్న టియాంగ్‌గాంగ్-1 భూమిని తాకడం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

టియాంగ్‌గాంగ్-1 ప్రస్తుతం ప్రయాణిస్తున్న కక్ష్య ఆధారంగా అది 43 డిగ్రీల ఉత్తర, 43 డిగ్రీల దక్షిణ అక్షాంశాంల మధ్య ఉందని తెలిపింది. దీన్ని బట్టి న్యూజిలాండ్‌, అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కడైనా అంతరిక్ష నౌక కుప్పకూలొచ్చని వివరించింది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ టియాంగ్‌గాంగ్-1 కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొంది.

చైనా తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రం టియాంగ్‌గాంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. భవిష్యత్తులో సొంతంగా అంతరిక్షంలో పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు ట్రయల్‌గా ఈ తాత్కాలిక స్పేస్‌ల్యాబ్‌ను పంపింది. 2016లో టియాంగ్‌గాంగ్-1 చైనా అదుపు తప్పింది. అప్పటినుంచి అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ భూమి వైపునకు ప్రయాణిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com