స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా శ్రీకాంత్, సింధు
- April 02, 2018
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తాజాగా స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను దక్కించుకున్నారు. బెస్ట్ కోచ్ అవార్డును పుల్లెల గోపీచంద్ కైవసం చేసుకున్నారు. ఈఎస్పీఎన్ తొలిసారిగా పలు విభాగాల్లో క్రీడాకారులకు అవార్డులు ప్రకటించింది. 11 విభాగాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు. అభినవ్ బింద్రా, సోమ్‌దేవ్, బైచుంగ్ భూటియా, జగ్బీర్ సింగ్, రోహిత్ బ్రిజ్‌నాథ్, వెంకటేశన్ దేవరాజన్, నిషా మిల్లట్, అపర్ణ పొపట్, జగదీశ్, మనీషా, అంజుబాబీ జార్జ్‌తో కూడిన జ్యూరీ బృందం విజేతలను ప్రకటించింది. గత ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సొంతం చేసుకున్న కిదాంబి శ్రీకాంత్‌కు పురుషుల విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేశారు. ఇక మహిళల విభాగంలో పీవీ సింధుకు ఈ అవార్డు దక్కింది. ఇక కోచ్ విషయానికి వస్తే పుల్లెల గోపీచంద్ బెస్ట్ కోచ్ అవార్డును కైవసం చేసుకున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..