అల్‌ అయిన్‌ ఇండియన్‌ సోషల్‌ సెంటర్‌ కొత్త భవనంలోకి

- April 02, 2018 , by Maagulf
అల్‌ అయిన్‌ ఇండియన్‌ సోషల్‌ సెంటర్‌ కొత్త భవనంలోకి

అబుదాబీ: అల్‌ అయిన్‌లోని ఇండియన్‌ సోషల్‌ సెంటర్‌, కొత్త ప్రాంగణంలోకి మారనుంది. గురువారం లాంఛనంగా ఈ కార్యక్రమం జరిగింది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో రిజిస్టర్‌ అయిన 43 ఏళ్ళ అనుభవం వున్న ఐఎస్‌సి, సోషియో కల్చరల్‌ యాక్టివిటీస్‌కి పెట్టింది పేరు. అల్‌ అయిన్‌లో నివసిస్తోన్న 60,000 మంది ఇండియన్స్‌కి ఈ ఐఎస్‌సి ఓ కేంద్రంగా పేరొందింది. కొత్త సెంటర్‌, అల్‌ అయిన్‌లోని ఖాబిసి డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటయ్యింది. సిటీ సెంటర్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు. లాంఛనంగా సెంటర్‌ని ప్రారంభించే క్రమంలో మూడు రోజులపాటు ఇండియా ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారుారు. 30 వరకు స్టాల్స్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఫుడ్‌, గేమ్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎడ్యుకేషనల్‌ ఇన్ఫర్మేషన్‌తో ఈ వేడుకలకు కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. శనివారం జరిగే డ్రాలో 25 ఎట్రాక్టివ్‌ ప్రైజ్‌లు వున్నాయి. అందులో కారుని గ్రాండ్‌ ప్రైజ్‌గా అందిస్తున్నట్లు సెంటర్‌ హానరరీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శవి స్టీఫెన్‌ చెప్పారు. మ్యూజికల్‌, డాన్స్‌ షోలు కూడా ఈ ఈవెంట్‌లో భాగం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com