నేటినుండి కామన్వెల్త్ గేమ్స్
- April 03, 2018
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ క్వీన్స్‌లాండ్ లోని కర్రారా మైదానంలో నేటినుండి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 నుండి 15 వరకు జరిగే ఈ గేమ్స్‌లో 71 దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను చూపనున్నారు. 19 క్రీడాంశాలలో 275 విభాగాలలో స్వర్ణ, రజిత, కాంస్య పతకాలకై వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు పోటీపడనున్నారు. భారతదేశం తరఫునుండి 15 క్రీడాంశాల్లో 115మంది పురుషులు, 105మంది మహిళలతో సహా మొత్తం 220 మంది ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో తమ ప్రతిభను చూపి పతకాలు సాధించడానికి కృషి చేయనున్నారు. కామన్‌వెల్త్ క్రీడా గ్రామంలోకి తన తండ్రి హర్వీర్ సింగ్‌ను అనుమతించకపోతే బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకుంటానని ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ హెచ్చరించింది. ఈ మేరకు ఆమె భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతాకు మంగళవారం లేఖ రాస్తూ... తన తండ్రికి అక్రిడేషన్ కల్పించాలని సైనా ఆ లేఖలో కోరింది. ఈ లేఖకు తలొగ్గి దిగొచ్చిన ఐఓఏ సైనా తండ్రిని కామన్‌వెల్త్ గేమ్స్‌కు అనుమతిస్తూ... అతను సైనా మ్యాచ్‌లన్నీ చూడవచ్చని స్పష్టం చేసింది. సైనా నెహ్వాల్ ఆ లేఖలో తన తండ్రి మద్దతు లేకుండా తాను బ్యాడ్మింటన్ ఆడలేనని... అందుకే ఆయన్ను అన్ని మ్యాచ్‌లకు తీసుకెళ్తుంటానని అన్నారు. తొలుత టీమ్ అధికారిగా తన తండ్రిని ధ్రువీకరించడంతో ఆయన ఖర్చులన్నీ తనే భరించి తీసుకొచ్చానని, తీరా ఇక్కడికి వచ్చాక ఆ పేరును టీమ్ అధికారిక జాబితా నుంచి ఐఓఏ అధికారులు తొలగించారని సైనా ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొంది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







