యూట్యూబ్ కార్యాలయం వద్ద కాల్పుల ఘటనపై 'పిచాయ్‌' దిగ్భ్రాంతి

- April 03, 2018 , by Maagulf
యూట్యూబ్ కార్యాలయం వద్ద కాల్పుల ఘటనపై 'పిచాయ్‌' దిగ్భ్రాంతి

అమెరికాలోని యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులు జరిపి అనంతరం తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచింది. కాలిఫోర్నియాలోని యూట్యూబ్‌ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనపై గుగూల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ట్విటర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. 'ఈ రోజు జరిగిన విషాదాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. ఈ కష్టసమయంలో, మా ఉద్యోగులు, యూట్యూబ్‌ కమ్యూనిటీకి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. వెంటనే స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ళ గూగుల్‌, యూట్యూబ్‌ ఉద్యోగులకు అండగా ట్వీట్‌ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com