అభ్యంతరకర దుస్తులు: 20 మంది మహిళల అరెస్ట్
- April 05, 2018
మస్కట్: బౌషెర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 20 మంది మహిళల్ని అభ్యంతరకర దుస్తుల్ని పబ్లిక్ ప్లేసెస్‌లో ధరిస్తున్నందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఆసియా, ఆఫ్రికా జాతీయులు వున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఖువైర్, బౌషెర్ ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్ట్ చేసినవారిని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు. ఒమన్ పీనల్ కోడ్ - రాయల్ డిక్రీ 7/2018 ప్రకారం, సంప్రదాయాలకు వ్యతిరేకంగా అభ్యంతరకర దుస్తుల్ని వేసుకుని పబ్లిక్‌లోకి వస్తే, నెల నుంచి మూడు నెలల జైలు శిక్ష, 300 నుంచి 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







