రెండేళ్లుగా తల్లిని ఫ్రిజ్ లో దాచిపెట్టిన కుటుంబ సభ్యులు
- April 05, 2018
అమ్మ అంటే ప్రేమ.. కాదు అమ్మ డబ్బులంటే ప్రేమ.. అందుకే ఆమె మరణించి రెండేళ్లైనా అంతిమ సంస్కారాలు చేయకుండా ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు కొడుకు. పశ్చిమ బెంగాల్ కోల్‌కతా బెహాలా ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల బీనా మజుందార్ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆమెకు భర్త గోపాల్, కొడుకు సువవ్రతా మజుందార్ ఉన్నారు. రిటైర్మెంట్ నాటికి బీనా ఉన్నత పదవిలో ఉండడంతో పింఛను నెలకు రూ.50లు వచ్చేది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది.
బీనా మరణించిన విషయాన్ని మూడో కంటికి తెలియకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఇంటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లో భద్రపరిచారు. ఎటువంటి దుర్వాసనా రాకుండా ఆమె మృత దేహానికి రసాయనాలు పూసి ఉంచారు. ఆమె మరణించినా వేలి ముద్రల సహాయంతో ప్రతినెలా ఫెన్షన్ ఆఫీసుకి వెళ్లి రూ.50లు తెచ్చుకునేవాడు కొడుకు. అయితే వీరి కుటుంబం పట్ల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బీనా ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటిలో ఓ డీప్ ఫ్రీజర్‌ను గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా అందులో బీనా మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో పింఛను కోసమే అలా చేసినట్లు బీనా భర్త 90 ఏళ్ల గోపాల్‌తో పాటు, కొడుకు సువవ్రతా అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







