న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త..
- April 05, 2018
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త. మీరు ప్రయాణించనున్న విమాన సర్వీసు రద్దు అయినా, విమానం రాకపోకల్లో జాప్యం జరిగినా, మీ సామాను పోయినా, దెబ్బతిన్నా ప్రయాణికులకు అధిక నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా ప్రతిపాదించింది. అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో సామగ్రి పోయినా, దెబ్బతిన్న కిలోకు మూడువేల రూపాయలు ప్రస్థుతం చెల్లిస్తున్నారు. కాని దెబ్బతిన్న సామాన్ల కోసం పరిహారాన్ని 20వేల నుంచి లక్షరూపాయల వరకు పెంచాలని విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. విమానం మిస్ అయినా, లేక పొరపాటున బోర్డింగును తిరస్కరించినా ప్రయాణికులకు రూ.3,000 నుంచి 20వేల రూపాయల వరకు పరిహారం చెల్లించాలని విమానయాన మంత్రిత్వశాఖలో ఉన్న నిబంధనలు మార్చాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







