ట్యాక్సీ ధరల్ని సవరించిన అజ్మన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌

- April 05, 2018 , by Maagulf
ట్యాక్సీ ధరల్ని సవరించిన అజ్మన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌

అజ్మన్‌:అజ్మన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌, ట్యాక్సీ కంపెనీలకు సంబంధించి ధరల్ని సవరించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. స్థానిక ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసులను మెరుగుపర్చడం, అజ్మన్‌ విజన్‌ 2021 లక్ష్యాన్ని చేరుకునేందుకుగాను తగిన వ్యూహాల్ని అమలు చేయడంలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్‌ సర్వేలు, స్టడీస్‌ నిర్వహించిన తర్వాతే కార్పొరేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర ఎమిరేట్స్‌కి సంబంధించిన పలు విషయాల్ని పరిశీలించి, అజ్మన్‌లో ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని, అత్యుత్తమ సేవలు వారి నుంచి ప్రయాణీకులకు అందేలా ఈ చర్యలు చేపట్టడం జరిగింది.2.5 అరబ్‌ ఎమిరేట్‌ దినార్స్‌ని పెంచడం ద్వారా ట్యాక్సీ డ్రైవర్లకు ఊరట కలిగినట్లయ్యింది. అయినప్పటికీ కూడా ఇతర ఎమిరేట్లతో పోల్చితే అజ్మన్‌లో ట్యాక్సీ ఛార్జీలు తక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com