మర్డర్‌ మిస్టరీని 24 గంటల్లో ఛేదించిన ఆర్‌ఎకె పోలీస్‌

- April 07, 2018 , by Maagulf
మర్డర్‌ మిస్టరీని 24 గంటల్లో ఛేదించిన ఆర్‌ఎకె పోలీస్‌

రస్‌ అల్‌ ఖైమా:రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌, ఓ మర్డర్‌ కేస్‌ని కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అరబ్‌ వర్కర్‌ హత్యకేసుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం. రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ - క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్లా అలి మెనఖాస్‌ మాట్లాడుతూ, అరబ్‌ వర్కర్‌ హత్యకు గురైనట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడయ్యిందని చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ని ఏర్పాటు చేశామనీ, విచారణలో మృతుడి రూమ్‌ మేట్‌ ఈ హత్యకు కారకుడిగా గుర్తించామని అధికారులు తెలిపారు. తరచూ ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవని నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఓ సందర్భంలో గొడవలు ఎక్కువైపోయాయనీ, ఈ నేపథ్యంలో రూమ్‌ మేట్‌ నిద్రిస్తున్న సమయంలో నిందితుడు అతన్ని, కటింగ్‌ టూల్‌తో చంపేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. చంపేసిన తర్వాత మృతుడి నోట్లో విషాన్ని పోసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నిందితుడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com