పుట్టినరోజు నాడు సెటైర్లను ఎదుర్కొంటున్న బన్నీ
- April 08, 2018స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ లేటెస్ట్ మూవీ 'నా పేరు సూర్య' ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈమూవీ యూనిట్ ఈమూవీలోని డైలాగ్ ఇంపాక్ట్ ను రిలీజ్ చేసింది. ఈ ఇంపాక్ట్ టీజర్ లో విలన్ బన్నీని పట్టుకుని 'సౌత్ ఇండియన్' అని దుర్భాషలాడతాడు. దానికి రెచ్చిపోయిన కోపంతో బన్ని 'సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా' అంటూ విలన్ పై పంచ్ విసురుతాడు.
ఇప్పుడు ఈడైలాగ్ ఈరోజు సోషల్ మీడియాలో ఇన్ స్టంట్ హిట్ గా మారింది. అయితే అల్లుఅర్జున్ వ్యతిరేకులు కొందరు ఈ డైలాగ్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. దీనికికారణం అల్లుఅర్జున్ పీఆర్ టీమ్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా అల్లుఅర్జున్ ను సౌత్ ఇండియన్ స్టైలిష్ స్టార్ అంటూ ఒక బర్త్ డే కేక్ ను డిజైన్ చేసి బన్ని అభిమానులకు షేర్ చేసారు.
అంతేకాదు ఈరోజు అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని చోట్ల బన్నీని 'సౌత్ ఇండియన్ స్టైలిష్ స్టార్' అంటూ బ్యానర్స్ కూడ కట్టారు. ఇప్పుడు ఈ విషయాలను టార్గెట్ చేస్తూ బన్నీ వ్యతిరేకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా అంటూ తనకు భేదాలు లేవు ఇండియా అంతా ఒకటే అని చెపుతున్న బన్నీని సౌత్ స్టైలిష్ స్టార్ గా ప్రమోట్ చేస్తున్నారు ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు సమాజానికి మంచిమాటలు చెపుతూ ప్రభావితం చేయాలి అని ప్రయత్నిస్తున్న అల్లుఅర్జున్ తానూ చెప్పే డైలాగులలోనే భావాలు అర్ధంకావా అంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా పుట్టినరోజునాడు ఇలా బన్నీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ కొందరు కామెంట్స్ చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..