ట్రక్కును ఢీకొన్న జెట్ ఎయిర్‌వేస్..తప్పిన పెను ప్రమాదం
- April 08, 2018
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని జెట్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. దుబాయ్ నుంచి వస్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానం, ఎయిర్‌పోర్టులోని టర్మినల్ 3 వద్ద ల్యాండ్ అయింది.
దానికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తేజ్ శాట్స్ సర్వీసు ప్రొవైడర్ కేటరింగ్ వాహనం అక్కడే ఉండటంతో, ల్యాండ్ అవుతున్న ఆ విమానం రెక్కలు ట్రక్కును ఢీకొన్నాయి. అయితే ఈ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడిందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







