జయలలిత కేసు...అపోలో చైర్మెన్ కు సమన్లు..!
- April 10, 2018
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్, ఆమెకు తుది రోజుల్లో చికిత్స జరిపిన అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. విచారణకు రావాలని ఆదేశాలు ఇస్తూ, అందుకు వారం రోజుల సమయం ఇస్తూ, నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
జయలలిత మరణం మిస్టరీని సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు విచారణను వేగవంతం చేస్తూ, పలు కోణాల్లో ఎంక్వయిరీ సాగిస్తున్న కమిషన్, ఇప్పటికే, జయకు సన్నిహితంగా ఉండే పలువురి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. ఆమెకు అందించిన చికిత్స, చేసిన వైద్య పరీక్షలు తదితరాలపై సమాచారం కోసం అపోలో హాస్పిటల్ కు సమన్లు పంపింది.
ఇప్పటికే ఈ సమన్లకు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున ఆసుపత్రి అధికారులు నివేదికను పంపగా, మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా విచారించేందుకు ప్రతాప్ సీ రెడ్డిని విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఒకటి, రెండు రోజుల్లో ఆయనకు సమన్లు పంపి, ఆపై వారంలోపు విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







