ఫ్లాష్ ఫ్లాష్..మోడీ మనస్తాపం, 12న నిరాహార దీక్ష
- April 10, 2018
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరుపై ఇరువురు సమీక్షించారు.
పార్లమెంటులో విపక్షాల తీరుపై మనస్తాపం చెందిన ప్రధాని మోడీ వారి తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఈ నెల 12న నిరాహార దీక్ష చేస్తారు.
ప్రధాని నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శలు
ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. పార్లమెంటు ముగిసిన వారం రోజుల తర్వాత మోడీ నిద్రలేచారని ఎద్దేవా చేసింది. అన్నాడీఎంకేతో పాటు ఇతర పార్టీల ఆందోళన కారణంగా రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో 23 రోజుల పాటు సభా కార్యక్రమాలు స్తంభించాయి.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీకు చర్చకు రాలేదు. టీఆర్ఎస్‌తో పాటు కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నిరసనలు వ్యక్తం చేయడంతో సభ సజావుగా సాగలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..