మధురవాణికి తోడుగా విజయ్‌ ఆంటోనీ

- April 10, 2018 , by Maagulf
మధురవాణికి తోడుగా విజయ్‌ ఆంటోనీ

మహానటి నుంచి ఒకొక్క లుక్కూ బయటకు వస్తోంది. మొన్నే మధురవాణి పాత్రలో సమంత ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ లుక్‌ బయటకు వచ్చింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ప్రియాంక దత్‌ నిర్మాత. సావిత్రిగా కీర్తిసురేష్‌ కనిపించనుంది. సమంత ఓ జర్నలిస్టుగా నటిస్తోంది. ఆమెకు తోడుగా ఫొటోగ్రాఫర్‌ విజయ్‌ ఆంటోనీ పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నాడు. 'నిజం ఎప్పుడూ అందంగానే ఉంటుంది మధురవాణిగారూ'' అంటూ పోస్టరుపై ఓ డైలాగ్‌ కూడా కనిపిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com