శ్రీరెడ్డి వెళుతున్న విధానం కరెక్ట్ కాదు: కంగనా
- April 10, 2018
శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శనతో టాలీవుడ్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చించుకునే అంశంగా మారింది. కాస్టించ్ కౌచ్, తెలుగు హీరోయిన్‌లకు సరైన గుర్తింపు అంటూ శ్రీరెడ్డి చేస్తున్న నిరసనకి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. శ్రీరెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తన నిరసనను సాధ్యమైనంతగా చేస్తూనే ఉంది. అయితే శ్రీరెడ్డి చేస్తున్న ఈ విధానం తప్పంటుంది బాలీవుడ్ భామ కంగనా రౌనత్. తాజాగా శ్రీరెడ్డి తీరుపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది.
టాలీవుడ్‌లోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులున్నారని, సినీ ఇండస్ట్రీలలో చాలామంది అమ్మాయిలు అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారని తాను కూడా అలాంటి ఇబ్బందులు పడ్డానని కంగనా చెప్పింది. అయితే ఇలాంటి విషయాలపై పోరాడటానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పిన కంగనా, శ్రీరెడ్డి ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ తరహాలో నిరసనలు వ్యక్తం చేస్తే అసలు సమస్య పక్కదారి పట్టే అవకాశం ఉందని, సరైన మార్గం ఎంచుకోవాలని శ్రీరెడ్డికి కంగనా సూచనలిచ్చింది.
బట్టలు విప్పేసి అర్ధనగ్న ప్రదర్శన చేయడం ద్వారా నిరసన తెలియజేయాలనుకోవడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి చర్యల వల్ల ఇండస్ట్రీలో సున్నిత మనస్కులైన కొందరు వ్యక్తులు ఇబ్బందిపడతారని కంగనా తెలిపింది. ఇలా చేయడం వల్ల ఆమెకు మద్దతు తెలపాలని అనుకునే కొందరు కూడా.. ఆమె పద్ధతి నచ్చక ముందుకు రారని తెలిపింది. జరిగిన అన్యాయంని చూపిస్తూ.. పోరాడుతున్న సమస్యకు ప్రచారం కలిగేలా చూసుకోవాలని ఆమెకు సలహా ఇస్తూ.. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటానికి మహిళలంతా ధైర్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







