'కథువా' ఘటనపై నేడు విచారణ

- April 15, 2018 , by Maagulf
'కథువా' ఘటనపై నేడు విచారణ

జమ్ము: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచారం, హత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నిందితులపై విచారణ చేపట్టనున్నారు. నిందితులలో ఒక మైనర్‌ కూడా ఉన్నాడు. కథువా ప్రధాన న్యాయాధికారి ఏడుగురు నిందితులపై చార్జిషీటు నమోదుచేసి, విచారణ కోసం సెషన్స్‌ కోర్టుకు తరలించారు. ఈ కేసులో జమ్ము కాశ్మీర్‌ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించింది. ఈనెల 13న సుప్రీంకోర్టు ప్రక్రియను అడ్డుకున్న జమ్ము, కథువా న్యాయవాదుల అసోసియేషన్‌పై కూడా విచారణ జరుపనుంది. న్యాయస్థానాలకు హాజరుకావద్దని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా, జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌ డివై చంద్రచూడసింగ్‌లతో కూడిన ధర్మాసనం జమ్ము హై కోర్టు బార్‌ అసోసియేషన్‌ను ఆదేశించింది. వారు చట్ట ప్రక్రియను అడ్డుకోలేరని సూచించింది. ఎనిమిది మంది నిందితులపై చార్జిషీటును నమోదు చేసిన క్రైం బ్రాంచ్‌ నలుగురు పోలీస్‌ అధికారుల పేర్లను కూడా చార్జిషీటులో పేర్కొంది. ముగ్గురు పోలీస్‌ అధికారులు సాక్ష్యాల్ని ధ్వంసంచేయడానికి రూ. 4 లక్షలు లంచం తీసుకున్నట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com