అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే: చైనా
- April 18, 2018
బీజింగ్ : దక్షిణప్రాంత దీవి హైనన్‌కు వీసా లేకుండా ప్రయాణం చేసేందుకు చైనా అనుమతించింది. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు అందరికీ అవకాశాలు కల్పించేలా అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా చైనా ఒక అడుగు ముందుకేసింది. మే నెల్లో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. 59దేశాలకు చెందిన పర్యాటకులు 30 రోజుల పాటు హైనన్ దీవిలో వీసా లేకుండా పర్యటించవచ్చునని స్టేట్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ క్యూ యున్‌హాయి ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాలతో సహా పలు దేశాల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ఈ దీవిని తయారుచేసేందుకు, చైనా పారదర్శకతకు ఒక నమూనాగా తీర్చిదిద్దే చర్యల్లో భాగమే ఇదని ఆయన పేర్కొన్నారు. హైనన్ దీవిలో గుర్రపు పందాలు వృద్ధిచేస్తామని, క్రీడలకు సంబంధించి కొత్త తరహా లాటరీలు ప్రవేశపెడతామని, అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తామని చైనా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







