జూలైలో విడుదలకు సిద్ధం కానున్న శ్రీనివాస కళ్యాణం..!

- April 18, 2018 , by Maagulf
జూలైలో విడుదలకు సిద్ధం కానున్న శ్రీనివాస కళ్యాణం..!

లవర్ బోయ్ నితిన్‌, గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని తప్పక అలరిస్తుందని అంటున్నారు. మిక్కి జే మేయర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నందిత శ్వేత, ప్రకాశ్‌రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తొలి షెడ్యూల్ గోదావరి జిల్లాలలో షూటింగ్ జరుపుకున్న టీం కొద్ది రోజుల క్రితం రెండో షెడ్యూల్ కోసం చండీఘర్ వెళ్లింది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి జూలై 24న మూవీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీం ఉన్నట్టు తెలుస్తుంది. నితిన్ నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో శ్రీనివాస కళ్యాణంపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం టైటిల్ లోగోతో పాటు పెళ్ళి పీటలపై కూర్చున్న నితిన్‌, రాశీ ఖన్నా ఫోటోని, పెళ్లికి సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్‌. ఇవి అభిమానులలో సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com