ఆ చిన్నారుల రక్షణ కోసం

- December 04, 2015 , by Maagulf
ఆ చిన్నారుల రక్షణ కోసం
 

 
ఖతర్‌ స్టేట్‌ పిల్లల ప్రత్యేకావసరాలను తీర్చేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడానికి కృత నిశ్చర్యంతో ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. స్పెషల్‌ నీడ్స్‌ చిల్డ్రన్‌ కోసం నెల రోజనులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్‌ చేశారు. ఇంటీరియర్‌ మినిస్టర్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ అబ్దుల్లా బిన్‌ నాజర్‌ బిన్‌ ఖలీఫా అల్‌ థని, లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ అబ్దుల్లా సలే ముబారక్‌ అల్‌ ఖులాఫి, మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అబ్దుల్లా బిన్‌ ఖలీద్‌ అల్‌ ఖహతాని, మినిస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డాక్టర్‌ హెస్సా సుల్తాన్‌ అల్‌ జబర్‌ తదితర ప్రముఖులు నిన్నటి కార్యక్రమానికి హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌, సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌, ఖతార్‌ యూనివర్సిటీ మరియు హమాద్‌ మెడికల్‌ కార్పొరేషన్‌ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. పిల్లల్లోని అంతర్గతంగా ఉన్న స్కిల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాలను ఈ వేదికపై ప్రదర్శించారు. పిల్లల్లో మానసిక పరిపక్వత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, తగిన సమయంలో వైద్యం తప్పక అందాల్సి ఉంటుందని ప్రముఖులు అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com