దుబాయ్:మర్డర్ మిస్టరీ: 24 గంటల్లో ఛేదన
- April 20, 2018
దుబాయ్:ఇథియోపియన్ మహిళ హత్య కేసులో నిందితుడ్ని ఇరవై నాలుగ్గంటల్లోనే దుబాయ్ పోలీస్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దుబాయ్ పోలీస్, క్రిమినల్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరీ మాట్లాడుతూ, ఆఫ్రికాకి చెందిన ఓ మహిళ చనిపోయిన విషయమై తమకు సమాచారం అందిందనీ, బరాహా ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగిందనీ, సంఘటనా స్థలానికి వెంటనే పోలీస్ చేరుకున్నాయని తెలిపారు. అక్కడికి వెళ్ళిన పోలీసులకు డికంపోజ్ స్థితిలో వున్న మహిళ మృతదేహం కన్పించింది. బాధితురాల్ని గుర్తించిన పోలీసులకు, ఆమెతో ఓ పాకిస్తానీకి సంబంధం వున్నట్లు నిర్ధారణ అయ్యింది. విచారణలో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనితో నిజం చెప్పించారు. ఆమెతో శృంగారంలో రెండుసార్లు పాల్గొని 200 దిర్హామ్‌లు చెల్లించాననీ, ఇంకాస్త సమయం వుండి, మరింత సొమ్ము చెల్లించాల్సిందిగా ఆ మహిళ డిమాండ్ చేయడంతో, ఆమెను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బుని దొంగిలించి, మొబైల్ ఫోన్లనూ తీసుకుని పారిపోయినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







