నకిలీ బంగారం కేసులో ఇరుక్కున్న హీరో తండ్రి..

- April 20, 2018 , by Maagulf
నకిలీ బంగారం కేసులో ఇరుక్కున్న హీరో తండ్రి..

షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ మంచి పేరు సంపాదించుకున్న రాజ్ తరుణ్ సినిమా ఫీల్డ్‌లోకి వచ్చి అసిస్టెంట్ డైరక్టర్‌గా కొనసాగాడు. ఈ తరుణంలోనే ఉయ్యాల జంపాలకు పని చేస్తుంటే ఆ సినిమా డైరక్టర్ రాజ్ తరుణ్‌నే హీరోగా చేయమన్నారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. మొదటి చిత్రంతోనే బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. వరుస ఆఫర్లను అందుకున్నాడు. తాజాగా రాజ్ తండ్రి ఓ నకిలీ బంగారం కేసులో చిక్కుకోవడం వివాదాస్పదమైంది. తండ్రి నిడమర్తి బసవరాజు సింహాచలం ఎస్పీఐ బ్రాంచ్‌లో 2013 నుంచి క్యాషియర్‌గా ఉద్యోగం చేసేవారు. తన భార్య రాజ్యలక్ష్మి మరికొంత మంది కుటుంబ సభ్యులు కలిసి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ తరువాత బ్యాంకు అధికారులు ఆడిట్‌లో అది నకిలీ బంగారంగా తేలింది. దీనిపై అప్పుడే గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోర్టులో విచారణ కూడా జరిగింది. విచారణ పూర్తయిన అనంతరం ఏప్రిల్ 20వ తేదీ శుక్రవారం విశాఖపట్నం మేజిస్ట్రేట్ సన్నీ పర్విన్ సుల్తానా బేగం తీర్పును వెల్లడించారు. ఈ తీర్పులో రాజ్ తరుణ్ తండ్రి నిందితుడిగా తేలడంతో అతడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com