షార్జా:ఛారిటీ ఆక్షన్‌లో 55 లైసెన్స్‌ ప్లేట్స్‌

- April 20, 2018 , by Maagulf
షార్జా:ఛారిటీ ఆక్షన్‌లో 55 లైసెన్స్‌ ప్లేట్స్‌

షార్జా:షార్జా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌, ఎమిరేట్స్‌ ఆక్షన్‌తో కలిసి సంయుక్తంగా ఛారిటీ పబ్లిక్‌ ఆక్షన్‌ని 55 ప్రత్యేకమైన వెహికిల్‌ నెంబర్‌ పేల్లట్స్‌ కోసం నిర్వహిస్తోంది. శనివారం అల్‌ జవహర్‌ రిసెప్షన్‌ మరియు కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ ఆక్షన్‌ జరుగుతుంది. 111, 303, 3333 నంబర్‌ ప్లేట్స్‌ని బిగ్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ కోసం నిర్వహిస్తున్నారు. మానవీయ కోణంలో ఈ ఆక్షన్‌ ద్వారా వచ్చే సొమ్ముని వినియోగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఆక్షన్‌ ప్రారంభమవుతుంది. 100000 అలాగే సింగిల్‌ డిజిట్‌ నంబర్‌ 3, తొమ్మిది ట్రిపుల్‌ డిజిట్‌ నెంబర్స్‌, మూడు డబుల్‌ డిజిట్‌ నెంబర్స్‌ కూడా ఈ ఆక్షన్‌లో వుంచుతున్నారు. ఓ మంచి పని కోసం చేస్తోన్న ఈ ఆక్షన్‌ ద్వారా వీలైనంత ఎక్కువ నిధుల్ని సమకూర్చి బిగ్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా అవసరమైనవారికి వైద్య సహాయం అందించాలనేది నిర్వాహకుల లక్ష్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com