ఎయిరిండియాలో ప్రమాదం..ముగ్గురికి గాయాలు
- April 21, 2018
న్యూఢిల్లీ : అమృత్సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో విండో ప్యానెల్ విరిగి ప్రయాణికులపై పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపు 15 నిమిషాల పాటు విమానంలోని ప్రయాణికులు భయోత్పాతానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం బయలుదేరాక ఒక ప్రయాణికుడు సీటు బెల్టు ధరించకపోవడంతో బంప్ వద్ద ముందున్న కేబిన్‌ను బలంగా గుద్దుకున్నాడు. దీంతో విండో ప్యానెల్ విరిగి అతడిపై పడింది. ఈ ఘటనలో అతడితోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయిఓవర్ హెడ్ ప్యానెల్ పగలడంతో ఆక్సిజన్ మాస్కులు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారని ఎయిరిండియా సీనియర్ అధికారి తెలిపారు. అయితే బయటి విండో పగలకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించామని, ఓవర్ హెడ్ ప్యానెల్‌కు తల బలంగా తగలడంతో ప్రయాణికుడికి కుట్లు పడ్డాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న డిజిసిఎ ఈ విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డుకు తెలిపింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్‌లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









