ఈజిప్ట్‌ ఫోటో జర్నలిస్టుకు యునెస్కో పురస్కారం..మే 2న ప్రదానం

- April 23, 2018 , by Maagulf
ఈజిప్ట్‌ ఫోటో జర్నలిస్టుకు యునెస్కో పురస్కారం..మే 2న ప్రదానం

పారిస్‌ : ప్రస్తుతం నిర్బంధంలో వున్న ఈజిప్ట్‌ ఫోటో జర్నలిస్టు మహ్మద్‌ అబూ జేడ్‌కు యునెస్కో వరల్ట్‌ ప్రెస్‌ ఫ్రీడం ప్రైజ్‌ లభించిందని ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం సోమవారం ప్రకటించింది. షాకాన్‌గా అందరికీ చిరపరిచితుడైన అబూ జేడ్‌ను 2013 ఆగస్టులో అరెస్టు చేశారు. కైరోలో భద్రతా బలగాలు, పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ మద్దతుదారుల మధ్య జరిగిన భయంకరమైన ఘర్షణలను ఆయన చిత్రీకరించినందుకు అరెస్టు చేశారు. ఈ ఘర్షణల సమయంలో పోలీసులను హతమార్చినందుకు, ఆస్తులను ధ్వంసం చేసినందుకు అభియోగాలను ఎదుర్కొంటున్న 700మందిలో ఆయన ఒకరు. షాకాన్‌ ప్రదర్శించిన ధైర్యం, సాహసాలకు, ప్రతిఘటనకు, భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల నిబద్ధతకు నివాళే ఈ అవార్డు అని యునెస్కో జ్యూరీ అధినేత మరియా రెస్సా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రవాది, క్రిమినల్‌ చర్యల్లో నిందితుడు అయిన వ్యక్తికి యునెస్కో ఇంతటి పురస్కారం అందచేయడం పట్ల ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవమైన మే 2వ తేదీన షాకాన్‌కు ఈ బహుమతిని అందచేస్తామని యునెస్కో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com