ఎడారి బతుకు పోరు
- December 04, 2015
కన్నతల్లి ఒడి నుండి జారి ..
పావురంగా చూసే పల్లె తల్లిని విడిచి ..
దుబాయి దుబ్బలల్ల ..సిమెంటు బురదలల్ల ..
బువ్వమెతుకులు లెంకుతున్నవ్ ..
కనురెప్ప మాటున దాగిన కన్నీరు ..
ఒక్కోచుక్క నీ ఎద పై రాలుతుంటే ..
ఇనుప చువ్వల పైన నీ చెమట బొట్టులు ..
మువ్వల సప్పుడు చేస్తుంటే ...
నిర్మాణ భవనాల మెట్ల పైన ...
నీ ఎముకలు నాట్యం చేస్తుంటే ..
నీ బలవంతపు నవ్వు వెనక బాధలు దాచి ...
సున్నితమైన మనసు పై గుదిబండను దించితివి ..
బంధాలకు దూరమై మెతుకుల కోసం ..
వెతుకుతున్న ఎడారి బతుకు పోరులో
మాడిపోవడితివి ...!
వాడిపోవడితివి ...!!
--ముస్కు రాము,(అబుధాబి)
తాజా వార్తలు
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..







