హెల్ప్ లైన్స్ అన్ని 112 నెంబర్ ను అనుసంధానం....

- December 04, 2015 , by Maagulf
హెల్ప్ లైన్స్ అన్ని 112 నెంబర్ ను అనుసంధానం....

దేశంలో మరో నెంబర్ ముఖ్యం కానుంది. ఆపదలో ఉన్నప్పుడు 100, 108 నెంబర్ డయల్ చేస్తే సమస్య పరిష్కారమయ్యేది. కాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం అత్యధునిక టెక్నాలజీతో కొత్త నెంబర్ ప్రవేశపెట్టింది. ఫైలెట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది కేంద్రం. సాప్ట్ వేర్ ను అమలు చేసి ప్రయోగత్మాకంగా ముందుండేందుకు టీఎస్ స్టేట్ ప్రయత్నిస్తోంది. అత్యవసర హెల్ప్ లైన్స్ అన్ని 112 నెంబర్ ను అనుసంధానం.... టెక్నాలజీకి అనుకూలంగా ప్రభుత్వాలు మారాలి. పాతకాలపు టెక్నాలజీతో నేరస్తులు తప్పించుకుంటున్నారని కేంద్రం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరు నేరం చేశారో గుర్తించేందుకు సంవత్సరాలు పట్టేది. సెకన్స్ లో నేరస్తులను గుర్తించకపోతే భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. ప్రపంచ ఆగ్రదేశాలు ఎలాంటి పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసుకున్నారో పరిశీలించి అత్యవసర హెల్ప్ లైన్స్ అన్ని 112 నెంబర్ ను అనుసంధానం చేయనుంది కేంద్రం. యూఎస్‌లో 911, బ్రిటన్‌లో 999 నంబర్లు.... యూఎస్‌లో 911, బ్రిటన్‌లో 999 నంబర్లు విస్తృతంగా అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఎన్‌ఈఆర్‌ఎస్ విధానాన్ని అమలు చేసేలా ఈ నెంబర్ పని చేస్తుంది. పోలీస్, ఫైర్, అంబులెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర అత్యవసర విభాగాలన్నింటిని ఎన్‌ఈఆర్‌ఎస్ వ్యవస్థ అనుసంధానంలో ఉంటాయి. మూడునెలల్లోగా హైదరాబాద్, సైబరాబాద్‌లో.... ఈ సాఫ్ట్ వేర్ శ్రీకారానికి సైబరాబాద్ కమిషనరేట్ ను ఎంచుకుంది కేంద్రం. ఎక్కడ చిన్న సంఘటన జరిగిన పెట్రోలింగ్ వాహనం నిమిషాల వ్యవధిలో ఉండనుంది. రూ.110 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను మూడునెలల్లోగా హైదరాబాద్, సైబరాబాద్‌లో ప్రారంభించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో సాఫ్ వేర్ ను నడపడం కష్టమైనా ప్రయోగం చేయనుంది కేసీఆర్ ప్రభుత్వం. అన్ని సేవలు 112 కే పంపాలని కేంద్రం భావిస్తోంది..... ఇక నుంచి అన్ని సేవలు 112 కే పంపాలని కేంద్రం భావిస్తోంది. ఇక్కడికి చేరాకే ఎమర్జెన్సీని బట్టి సమాచారం అందించనున్నారు అధికారులు. ఇది ఒక రకంగా మంచిదే. ఇటీవల 108 , ఫైర్ సిబ్బందికి ఫేక్ కాల్స్ బెడద ఎక్కువగా ఉండడంతో నిర్ణయం సరైందే అంటున్న వాదనలు వినిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com