తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
- April 23, 2018
ప్రముఖ దర్శకుడు టీఎల్‌వీ ప్రసాద్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2018' పురస్కారం అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఈ అవార్డు అందుకున్నారు. టీఎల్‌వీ ప్రసాద్ ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్‌రావు కుమారుడు. దాదాపు 85 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో 40 హిందీ చిత్రాలున్నాయి. మిథున్ చక్రవర్తితోనే ఏకంగా 35 చిత్రాలు తెరకెక్కించారు. ఓ తెలుగు దర్శకుడుబాలీవుడ్‌లో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులతో చిత్రాల్ని తెరకెక్కించారు. బాలీవుడ్‌లో కొన్ని ధారావాహికలు కూడా నిర్మించారు. ప్రస్తుతం హిందీలో 'జై శ్రీకృష్ణ', 'జైజైజై భజరంగభళీ' సీరియల్స్‌ని తెరక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్‌ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం