మహానటి పై విజయ్ దేవరకొండ చిల్లర కామెంట్
- April 25, 2018
విజయ్ దేవరకొండ.అర్జున్ రెడ్డి సినిమా ముందు వరకు అంతగా తెలియని పేరు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు..సినిమాకు ముందే లిప్ లాక్ లతో ,చిల్ తాతయ్యా అంటూ విహెచ్ గురించి పోస్టులు పెట్టడం,ఆడియో ఫంక్షన్లో బూతులు మాట్లాడడంతో ఈ అన్ని వివాదాల నడుమ రిలీజైన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.విజయ్ కి ,డైరెక్టర్ సందీప్ కి స్టార్ డమ్ తీసుకొచ్చింది..ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో వివాదంలో చిక్కుకున్నాడు.. మహానటి సావిత్రి గురించి కామెంట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు..అంతేకాదు తాను చేసినదాన్ని సమర్దించుకుంటున్నాడు..ఇంతకీ విజయ్ ఏమన్నాడు నెటిజన్లకు ఎందుకు కోపం వచ్చింది..
అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' అనే అపురూప చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ ఈ చిత్రంలో సావిత్రిగా నటిస్తుండగా.. సమంత జర్నలిస్ట్ మధురవాణిగా.. విజయ్ దేవకొండ ఫోటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించిన ప్రతి అంశం ఆసక్తికరంగా ఉంటూ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా 'మహానటి' మూవీకి సంబంధించిన ఒక పోస్టర్‌ను విజయ్ దేవరకొండ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. 'మహానటి'ని ఉద్దేశించి 'వాట్ ఏ కూల్ చిక్.. మహానటి' అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశాడు.. ఒక మహానటి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె గురించి ఇలాగేనా మాట్లాడేది.. సీనియర్ నటీమణి అనే గౌరవం లేదా అనేది అభిమానుల కోపానికి కారణం.
చిక్.. ఏందిరా.. సీనియర్స్‌కి కొంచె రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ విజయ్ కి తన స్టైల్లోనే రిప్లై కామెంట్స్ పెడుతున్నారు 'మహానటి' అభిమానులు.అయితే ఈ విషయంపై వెనక్కి తగ్గకపోగా తనని తాను మరింతగా సమర్ధించుకుంటూ తలబిరుసుగా ప్రవర్తిస్తున్నాడు విజయ్. 'ఆమెను ఆల్కహాలిక్, హోమ్‌బ్రేకర్ అంటూ మాట్లాడిన మీరు నా మాటల వల్ల బాధ పడుతున్నారా' అంటూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నాడు. అంతేకాదు క్షమాపణలు కావాల్సివాళ్లు చెన్నై లీలా ప్యాలెస్‌లో ఉన్నా వచ్చేయండి అంటూ వెటకారంగా సమాధానం చెప్తున్నాడు. పనిలో పనిగా నా పోస్ట్‌ని తప్పుబట్టి సరిగా రాయాలనుకునే వారు [email protected]కు రెస్యూమ్‌తో దరఖాస్తు చేసుకోండి. మీకు మంచి ఉద్యోగం ఇస్తా అంటూ సమాధానమిచ్చాడు.
ఒక్క సినిమాకే ఇంత తలపొగరా..చేసిన తప్పు ని ఒప్పుకోకుండా మరింతగా సమర్ధించుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహానటి విషయంలో విజయ్ చేసింది తప్పా రైటా..మీ ఉద్దేశ్యం ఏంటి..విజయ్ కామెంట్ ని యాక్సెప్ట్ చేస్తారా??
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!