ట్రంప్‌ యోచనకు వ్యతిరేకత.. ఎన్నారైలు, ఐటీ కంపెనీల ఆందోళన

- April 25, 2018 , by Maagulf
ట్రంప్‌ యోచనకు వ్యతిరేకత.. ఎన్నారైలు, ఐటీ కంపెనీల ఆందోళన

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌-4 వీసా తో పనిచేసే అనుమతిని తొలగించడంపై ఐటీ ఇండిస్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవవుతోంది. అమెరికాలో హెచ్‌1-బి వీసా జీవిత భాగస్వాములకు ఉన్న హెచ్‌-4 వీసా వర్క్‌ పర్మిట్‌ను తొలగించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఐటీ ఇండిస్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేసవి నుంచి ఇది అమలు కాగలదని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం వెల్లడించడంతో ప్రవాస భారతీయుల్లో ఆందోళన నెలకొంది. పని అనుమతి రద్దు చేస్తే అధికంగా నష్టపోయేది భారతీయులే. హెచ్‌-4 వర్క్‌ పర్మిట్‌ రద్దు చెయ్యాలనే నిర్ణయాన్ని చాలా మంది శాసనకర్తలు, ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సహా పలు ఐటీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధన వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపిస్తుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తుందని సిలికాన్‌వ్యాలీకి చెందిన ఎఫ్‌డబ్ల్యుడీ.యూఎస్‌ వెల్లడించింది. దీన్ని ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ తరహా పలు కంపెనీలు కలిసి ఏర్పాటు చేశాయి. ట్రంప్‌ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్‌ 4 వీసాదారుల్లో 80శాతం మంది మహిళలే ఉన్నారని, వారు చాలా విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నారని, వారు తమ జీవితభాగస్వాములతో అమెరికా రాకముందు వారి వారి దేశాల్లో పిజిలు చేసి వస్తున్నారని పేర్కొంది. హెచ్‌-4 వీసా వర్క్‌ పర్మిట్‌ తొలగిస్తే హెచ్‌1-బీ వీసాదారులు తమ అవసరాలకు తగినట్లుగా ఆర్జనలేక ఇబ్బందులు పడతారని ఎఫ్‌డబ్ల్యుడీ. యూఎస్‌ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com