అసలే మ్యాచ్ పోయింది. ఆపై రూ.12 లక్షల ఫైన్
- April 26, 2018
ఐపీఎల్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినా చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. అసలే మ్యాచ్ పోయిన బాధతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉంటే. మూలుగే నక్కపై తాటిపండు పడ్డ చందగా విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా కెప్టెన్ కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్ వేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసినా. 82 పరుగులతో అంబటి రాయుడు, 70 పరుగులతో ఎంఎస్ ధోనీ చెలరేగడంతో చెన్నై విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద కనీస ఓవర్-రేట్‌కు సంబంధించి కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించినట్టు ప్రకటించింది ఐపీఎల్.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







