షార్జాలో భారత మహిళ హత్య
- April 26, 2018
షార్జా:36 ఏళ్ళ మహిళను హత్య చేసి, పాతి పెట్టిన ఘటన షార్జాలో వెలుగు చూసింది. షార్జాలోని మైసలోన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబం నివాసం వుంటోన్న ఇంట్లోనుంచి దుర్గంధం వస్తుండడంతో పోలీసులకు, ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో తవ్వి చూడగా, ఓ మహిళ మృతదేహం కుళ్ళిన స్థితిలో బయటపడింది. నెల రోజుల క్రితమే ఆ మహిళ హత్యకు గురయ్యిందని పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదాల కారణంగా భర్త, తన భార్యను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత తన పిల్లలతో కలిసి నిందితుడు స్వదేశానికి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









