ఆడవేషంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
- April 26, 2018అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ఈ ఆడ వేషం ఏంటి.. చేతిలో ఆ పార ఏంటి.. పొలంలో ఆ పనులేంటి.. అసలేమైంది ఈయనకు. అన్నీ ఇలాంటి తిక్క పనులే చేస్తారు అని అనుకుంటున్నారా.. అస్సలు కాదండి.. ఈ భూమి మీద మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్ద వాళ్లు అంటుంటారు. అది నిజమేనేమో అనిపిస్తుంది ఇలాంటి వారిని చూస్తే అచ్చం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ఉంది స్పెయిన్కు చెందిన ఓ మహిళ. డొలోరెస్ లెయిస్ ఆంటెలో అనే ఈ మహిళా రైతు దూరం నుంచి చూస్తే అచ్చం ట్రంప్ లానే ఉందంటూ ఈమె ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫొటో షేర్లు, లైకులతో హల్ చల్ చేస్తోంది. ఇక ఆంటె కూతురైతే మేం ట్రంప్ చుట్టాలైతే ఎంత బావుండేదో అంటూ కాసేపు సరదా పడింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!