'మన మద్రాస్ కోసం' అనే పేరుతో సహాయ నిధుల సేకరణ ...
- December 05, 2015
మన మద్రాస్ కోసం!ఎడతెరిపిలేని వర్షాలతో కన్నీటి సంద్రమైన చెన్నై నగరానికి చేయూత అందించేందుకు తెలుగు చిత్రసీమ తన వంతు పాత్ర పోషిస్తోంది. 'మన మద్రాస్ కోసం' పేరిట వరద బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకుల్ని అందించడానికి తెలుగు తారలు నడుంబిగించారు. రామానాయుడు స్టూడియో కేంద్రంగా కొందరు నటులు దాతల నుంచి నిత్యావసర వస్తువుల్ని సేకరిస్తున్నారు. సరుకుల్ని ట్రక్కుల్లో చెన్నైకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు, కథానాయకుడు ప్రభాస్ కలసి వరద బాధితుల సహాయార్థం రూ. 15లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వరద తాకిడికి గురైన ప్రాంతాల కోసం ప్రభాస్ రూ. 5 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ప్రభాస్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూ. 5 లక్షలు ప్రకటించింది. కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ఐదు వేల మంది కోసం ఆహారం, తాగునీరు పంపించనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని కొన్ని వ్యాపార సముదాయాల దగ్గర తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు నటీనటులు విరాళాల్ని సేకరించబోతున్నారు.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







