డ్రగ్స్‌ ప్యాకేజ్‌తో పట్టుబడ్డ మహిళ

డ్రగ్స్‌ ప్యాకేజ్‌తో పట్టుబడ్డ మహిళ

అబుదాబీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ మహిళ సైకోట్రాఫిక్‌ డ్రగ్స్‌తో కూడిన ప్యాకెట్‌తో కస్టమ్స్‌ అధికారులకు చిక్కింది. ఆసియాకి చెందిన ఆ మహిళ, తనకు ఆ ప్యాకేజీలో ఏముందో తెలియదని విచారణలో వెల్లడించింది. వీసా ఇస్తామని చెప్పి, ఓ ప్యాకేజీని డెలివర్‌ చేయాల్సిందిగా తనకు కొందరు సూచించారనీ, వీసా కోసం వారు చెప్పింది చేశాననీ ఆమె వెల్లడించింది. మొత్తం 1,300 పిల్స్‌ని ఆ ప్యాకేజీలో అధికారులు గుర్తించారు. ఈ కేసులో తదుపరి విచారణ మే 30న జరగనుంది. 

Back to Top