తగ్గిన బంగారం ధర...
- April 27, 2018
దిల్లీ:పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధర బాగా పెరిగింది. కాగా అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో నేటి బులియన్ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా డిమాండ్ తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నేడు పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.190 తగ్గి రూ.32,210గా ఉంది. వెండి కూడా ఇదే బాటలో పయనించింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.40,450గా ఉంది. పారిశ్రామిక అవసరాలకు, నాణేల తయారీకి కూడా డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. రూపాయి మారం విలువ బలహీన పడి డాలరు విలువ పెరగడం కూడా ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం తగ్గి 1316.30డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.27శాతం తగ్గి 16.47 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు