దుబాయ్:14 మిలియన్‌ దిర్హామ్‌ దొంగతనం ఏడుగురిపై విచారణ

దుబాయ్:14 మిలియన్‌ దిర్హామ్‌ దొంగతనం ఏడుగురిపై విచారణ

దుబాయ్:మనీ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ డ్రైవర్‌, అతని ఇద్దరి స్నేహితులు 14 మిలియన్‌ దిర్హామ్‌ దొంగతనం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. 14 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన 10 ఏటీఎం బాక్సుల్ని దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. వీరికి సహకరించిన మరో నలుగురిపైనా కేసులు నమోదయ్యాయి. వీరందరూ పాకిస్తాన్‌కి చెందినవారే. వీరిలో ఒకరు మనీ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. ఫేక్‌ పాస్‌పోర్టులపై పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దొంగతనం కోసం పూర్తిగా సన్నద్ధమైన వీరంతా పకడ్బందీగా హోటల్‌ రూమ్స్‌ని కూడా తాత్కాలిక నివాసం నిమిత్తం బుక్‌ చేసుకున్నట్లు విచారణలో తేలింది. దొంగతనం జరిగిన రెండు గంటల్లోనే దేశం నుంచి పారిపోయేందుకు ఫేక్‌ పాస్‌పోర్టులు సిద్ధం చేసుకున్నట్లు మొదటి నిందితుడు విచారణలో చెప్పాడు. నిందితులంతా 27 నుంచి 48 ఏళ్ళ వయసులోపువారే.

 

Back to Top