చిత్రీకరణ తుది దశలో తేజ్ ఐ లవ్ యు..

- April 28, 2018 , by Maagulf
చిత్రీకరణ తుది దశలో తేజ్ ఐ లవ్ యు..

సాయిధరమ్‌ తేజ్‌ అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రానికి తేజ్‌ ఐలవ్‌ యూ అనే పేరును ఖరారు చేశారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కేఎస్‌ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ కరుణాకరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. రెండు పాటలు మినహా మొత్తం రూపకల్పన పూర్తయింది. తేజ్‌ ఐ లవ్‌యూ చిత్ర ప్రోగ్రెస్‌ను నిర్మాత కేఎస్‌ రామారావు వివరించారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు కరుణాకరణ్‌, మాటల రచయిత డార్లింగ్‌ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్‌ రామారావు మాట్లాడుతూ..రెండు పాటలు మినహా మా చిత్రం పూర్తయింది. పాటల చిత్రీకరణ కోసం పారిస్‌ వెళ్తున్నాం. తిరిగి వచ్చాక చిన్న ప్యాచ్‌ వర్కులు చేస్తే సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. మే నెలంతా నిర్మాణాంతర కార్యక్రమాలు చేసి వీలైనంత త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇప్పటిదాకా చేసిన సినిమా అంతా షో వేసుకుని చూశాం. చాలా బాగా వచ్చింది.

ముఖ్యంగా సాయిధరమ్‌ తేజ్‌ ఈ పాత్రలో ఒదిగిపోయాడు. చాలా ఉత్సాహంగా నటించారు. అనుపమా ఎంత మంచి నటి అయినా.ఆమెపై తేజ్‌ పైచేయి సాధించాడు. ప్రేమికుడిగా తేజ్‌ ఆకట్టుకుంటాడు.

సాంకేతిక నిపుణులు ప్రతిభావంతంగా పనిచేశారు. మాటల రచయిత డార్లింగ్‌ స్వామి ఈతరం యువతకు నచ్చేలా సంభాషణలు రాశారు. అన్నారు. నిర్మాత కేఎస్‌ రామారావు కథకు అనుకున్నట్లు వచ్చేందుకు రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నారని, సినిమా చూశాక ఎలా ఉందో ప్రేక్షకులు చెప్పాలని దర్శకుడు ఎ కరుణాకరన్‌ అన్నారు.

తేజ్‌ ఐలవ్‌ యూ చిత్ర టీజర్‌ మే 1న విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com