మళ్ళీ దెబ్బకొట్టిన ఫేస్‌బుక్‌

- April 29, 2018 , by Maagulf
మళ్ళీ దెబ్బకొట్టిన ఫేస్‌బుక్‌

డేటా లీక్స్‌ టెన్షన్‌ నుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్‌బుక్‌ అధినే మార్క్‌ జూకర్‌ బర్గ్‌ మరో బాంబు పేల్చారు. మున్ముందు మరింతగా డేటా లీక్‌ ఉండే అవకాశముందని ఫేస్‌బుక్‌ తెలిపింది. అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్ఈసీ)కు సమర్పించిన త్రైమాసిక నివేదికలో ఫేస్‌బుక్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫేస్‌బుక్‌ నుంచి సేకరించిన కోట్ల మంది డేటాను కేంబ్రిడ్జ్‌ అనలిటికా లీక్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌ చట్ట సభలు దీనిపై విచారణ జరుపుతున్నాయి. తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్‌బుక్‌ ఎస్ఈసీకి తెలిపింది. దీనివల్ల తమ బ్రాండ్‌, వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కూడా తెలిపింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా లీక్స్ వ్యవహారం కంపెనీ నిర్లక్ష్యానికి మున్ముందు భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలుస్తోంది. బ్రిటన్‌, యూఎస్‌ చట్టసభలు కంపెనీ భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com