షిర్డీ సాయినాధుని సేవ‌లో ఏపీ గ‌వ‌ర్న‌ర్

- July 27, 2024 , by Maagulf
షిర్డీ సాయినాధుని సేవ‌లో ఏపీ గ‌వ‌ర్న‌ర్

షిర్డీ: ఏపీ గవర్నర్​ అబ్దుల్​ నజీర్​ షిర్డీలోని సాయిబాబాను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో షిర్డీ వెళ్లిన ఆయన బాబా సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ కుటుంబానికి సాయిబాబా శాలువా, విగ్రహం, శ్రీసాయి సచ్చరిత్రను అందజేశారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ గత రెండు రోజులుగా షిర్డీలో పర్యటిస్తున్నారు. కుటుంబ సమేతంగా షిర్డీ వెళ్లిన ఆయన సాయిబాబాను దర్శించుకున్నారు. బాబాకు షిరిడీ మాజే పంఢర పూర్హి హారతి ఇచ్చి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బాబా ధూప, దీప నైవేద్య కార్యక్రమంలో గవర్నర్​ పాల్గొన్నారు. అనంతరం సాయినాథుని విగ్రహాన్ని గవర్నర్​ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నారు. హారతి అనంతరం సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు.


- Advertisement -
అంత‌కు ముందు బాబా ఆలయానికి చేరుకున్న ఆయ‌న‌కు . ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంత‌రం సాయిబాబా సమాధి దర్శనం చేసుకున్నారు. సాయి గురుస్థాన్, ద్వారకామాయిని కూడా గవర్నర్ సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సాయిబాబా మ్యూజియాన్ని కూడా గవర్నర్​ తిలకించారు. సాయిబాబా తన జీవితకాలంలో ఉపయోగించిన వస్తువులన్నింటి గురించి షిర్డీ సంస్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సాయిబాబా అప్పట్లో ఉపయోగించిన వస్తువులను గవర్నర్​ వీక్షించారు. సాయినాథుని దర్శనం పూర్తయ్యాక గవర్నర్​ అబ్దుల్​ నజీర్​కు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గోరక్ష్ గాడిల్కర్ గవర్నర్ కుటుంబానికి సాయిబాబా శాలువా, విగ్రహం, శ్రీసాయి సచ్చరిత్రను అందజేశారు.

ఈ సందర్భంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గోరక్ష్ గాడిల్కర్​తో గవర్నర్​ సాయిబాబా సమాధి దర్శనం తన మనసుకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయనతో అన్నారు. నిత్యం లక్షలాది మంది భక్తులు సాయిబాబా దర్శనానికి షిర్డీకి వస్తుండటం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఎంతమంది భక్తులు వచ్చిన ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని ఆయన అన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఎంతో అందంగా తీర్చిదిద్దారని గవర్నర్ అన్నారు. గవర్నర్​తో పాటు సాయిబాబా సంస్థాన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి తుకారాం, సాయిబాబా సంస్థాన్ పబ్లిక్ రిలేషన్స్ హెడ్ తుషార్ షెల్కే, సాయి ఆలయ అధిపతి విష్ణు థోరట్​ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com