చిన్నారికి వేధింపులు: వలసదారుడి అరెస్ట్
April 29, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, చిన్నారిని వేధించిన కేసులో ఓ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు. మరో కేసులో ఇంకో వలసదారుడ్ని, సిటిజన్‌ని కూడా అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు వెల్లడించారు. ఫార్మ్‌కి నిప్పంటించిన కేసులో ఈ వలసదారుడ్ని, సిటిజన్‌నీ అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. చిన్నారిని వేధించిన వలసదారుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది.