వెదర్‌ అప్‌డేట్‌: యూఏఈలో క్లౌడీ వీక్‌

- April 29, 2018 , by Maagulf
వెదర్‌ అప్‌డేట్‌: యూఏఈలో క్లౌడీ వీక్‌

యూఏఈ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పడ్తున్నాయి. ఆకాశం మేఘావృతమై కన్పిస్తోంది. ఈ వారమంతా ఇదే వాతావరణం కొనసాగుతుందనీ, ఉష్ణోగ్రతలు తగ్గఉతాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. దమ్తా వద్ద అత్యల్ప ఉష్ణోగ్రత సోమవారం ఉదయం 6 గంటల సమయానికి 20.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. సముద్ర తీర ప్రాంతాలు ఇంకా ఎక్కువ మేఘావృతం కావొచ్చు. బలమైన గాలులు వీచే అవకాశం వుంది. సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్‌ సందర్శన కోసం వెళ్ళేవారు అప్రమత్తంగా వుండాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com