ఫేక్‌ గోల్డ్‌ విక్రయం: ఇద్దరి అరెస్ట్‌

- April 30, 2018 , by Maagulf
ఫేక్‌ గోల్డ్‌ విక్రయం: ఇద్దరి అరెస్ట్‌

షార్జాలో ఫేక్‌ గోల్డ్‌ విక్రయిస్తోన్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ - జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ షార్జా పోలీస్‌, పెయింటెడ్‌ మెటల్‌ (3 కిలోలు) కలిగి వున్న ఇద్దర్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఆర్కియాలజీ సైట్‌ నుంచి తాము బంగారాన్ని వెలికి తీశామని చెబుతూ, అమాయకుల్ని ఈ నిందితులు మోసం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బంగారాన్ని అధీకృత బంగారు వ్యాపార సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనీ, తక్కువ ధర పేరుతో నకిలీ బంగారాన్ని విక్రయించే వారి పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ ఇబ్రహీమ్‌ ముసాబా అల్‌ అజెల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com